పాకిస్తాన్ ఒలింపిక్ జట్టు మాటున ఉగ్రవాదులు లండన్ వచ్చే ప్రమాదముందని ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్ హెచ్చరించింది. ఒలింపిక్స్ సందర్భంగా పాక్‌లో వీసా స్కామ్ చోటుచేసుకుందని వెల్లడించింది. పాక్ జట్టు 'బోగస్ సహా యక సిబ్బంది' కింద తప్పుడు పాస్‌పోర్ట్‌లు, వీసాలు ఇప్పించేందుకు ఓ ముఠా రంగంలోకి దిగిందని ఈ టాబ్లాయిడ్ తెలిపింది. దీనివల్ల ఉగ్రవాదులు మారు పేర్లతో పాస్ట్‌పోర్ట్, వీసా లు పొంది సునాయాసంగా ఇంగ్లండ్ చేరుకోవచ్చని 'ది సన్' ఆందోళన వ్యక్తం చేసింది. వీసా స్కామ్‌లో పాక్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు, అధికారుల ప్రమేయముందని శూలశోధనలో తేలినట్టు పేర్కొంది. ఈ స్కామ్‌లో లాహోర్ కేంద్రంగా పనిచేసే డ్రీమ్ లాండ్ ట్రావెల్ ఏజన్సీ, అబిద్ చౌదరి అనే రాజకీయ నాయకుడు భాగస్వాములని వెల్లడించింది. 'శూలశోధనలో పాల్గొన్న మా విలేకరికి ఈ ముఠా మారు పేరుతో పాక్ పాస్‌పోర్టును సమకూర్చింది. రెండుమాసాలు ఉండేలా వీసా పొందేందుకు అబిద్ చౌదరి అతని నుంచి పది లక్షల రూపాయలను (పాక్ కరెన్సీ) లంచంగా తీసుకున్నాడు. పాక్ జట్టులో భాగంగా అతణ్ని లండన్‌కు పంపాడు. మా విలేఖరి శుక్రవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు' అని ది సన్ పేర్కొంది. మారు పేరుతో ఎలా వీసా పొందవచ్చో వివరిస్తూ అబిద్ చౌదరి మాట్లాడిన దృశ్యాన్ని రహస్యంగా చిత్రీకరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more